ఒడిదుడుకుల్లో మార్కెట్లు!

by  |
ఒడిదుడుకుల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లు బుధవారం ఒడిదుడుకుల మధ్య ముగిశాయి. మంగళవారం జీడీపీ గణాంకాలకు తోడు వ్యాక్సిన్ సంబంధిత వార్తలతో భారీగా ర్యాలీ చేసిన సూచీలు కొంత నెమ్మదించాయి. క్రితం లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఊగిసలాటల మధ్య కదలాడాయని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 37.40 పాయింట్ల స్వల్ప నష్టంతో 44,618 వద్ద ముగియగా, నిఫ్టీ 4.70 పాయింట్లు లాభాపడి 13,113 వద్ద ముగిసింది.

నిఫ్టీలో మెటల్, ఐటీ, రియల్టీ, ఆటో రంగాలు 1 శాతం వరకు బలపడగా, ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల రంగాలు స్వల్పంగా నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్, టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడగా, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లె ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఅ, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.78 వద్ద ఉంది.

Next Story

Most Viewed