పెరిగిన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు

by  |
పెరిగిన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా బలహీన పడ్డ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో రికార్డును నమోదు చేసింది. 2020, మూడో త్రైమాసికంలో ఎగుమతులు 8 శాతం వృద్ధితో 5 కోట్ల యూనిట్లుగా నమోదు చేశాయని పరిశోధనా సంస్థ కెనాలిస్ వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్ విక్రయాలకు ఈ త్రైమాసికం బాగా కలిసొచ్చిందని, ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం, ఆర్థికవ్యవస్థ వృద్ధికి సానుకూల వాతావరణాన్ని కల్పించడంతో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు పెరిగాయని నివేదిక పేర్కొంది. వీటితో పాటు రవాణాకు పునరుద్ధరణ కావడం, ప్రధానంగా ఆన్‌లైన్ అమ్మకాలు, పండుగ సీజన్‌తో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ రికార్డు స్థాయిలో ఎగుమతులను నమోదు చేసిందని కనాలిస్ అనలిస్ట్ అద్వైత్ వివరించారు.

ముఖ్యంగా చైనాకు చెందిన షావోమీ కంపెనీ 1.1 కోట్ల యూనిట్లతో 9 శాతం వృద్ధిని సాధించి మార్కెట్ లీడర్‌గా నిలిచింది. రెండో స్థానంలో శాంసంగ్ 7 శాతం వృద్ధితో 1.02 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసింది. 19 శాతం వృద్ధితో వీవో 88 లక్షల యూనిట్లుగా నమోదు చేసింది. మరో చైనా కంపెనీ రియల్‌మీ 87 లక్షలతో నాలుగో స్థానంలో ఉంది. ఒప్పో ఐదో స్థానంలో 61 లక్షల యూనిట్లను రవాణా చేసింది. ఈ జాబితాలో చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీల ఎగుమతుల వాటా 74 శాతం సాధించారు. గతేడాది ఇది 70 శాతంగా నమోదైంది.


Next Story