తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం!

by  |
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం!
X

దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా లెక్కించిన రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలతో పోలిస్తే మార్చిలో 5.91 శాతానికి తగ్గింది. జాతీయ గణాంకాల సంస్థ(ఎన్ఎస్‌వో) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం అంతకుముందు నెలలో 10.81 శాతం ఉండగా, మార్చిలో 8.76 శాతానికి పడిపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 6.58 శాతం ఉండగా, మార్చిలో 5.91కి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ పెట్టుకున్న లక్ష్యం కంటే తక్కువగా నమోదైందని, మొదటిసారి అంచనాను మించి తగ్గిందని ఎన్ఎస్‌వో నివేదిక చెబుతోంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానాన్ని నిర్ణయించేప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆర్‌బీఐని ఆదేశించింది.

Tags : Retail Inflation, Retail Inflation March, Consumer Price Index, CPI, Retail Inflation Dips



Next Story