80 శాతం పెరిగిన భారత ఎగుమతులు

by  |
80 శాతం పెరిగిన భారత ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: సానుకూల వృద్ధిని సూచిస్తూ ఈ నెల మొదటివారంలో భారత ఎగుమతులు 80 శాతం పెరిగి రూ. 51.2 వేల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే వారంలో ఎగుమతులు రూ. 28.6 వేల కోట్లు నమోదవగా, 2019, మే మొదటివారంలో రూ. 47.4 వేల కోట్లుగా ఉన్నాయని గణాంకాలు పేర్కొన్నాయి. సమీక్షించిన ఇదే కాలంలో దిగుమతులు సైతం ఇదే స్థాయిలో 80.7 శాతం పెరిగి రూ. 64.8 వేల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో రూ. 35.9 వేల కోట్లు, 2019లో రూ. 76.1 వేల కోట్లుగా నమోదయ్యాయి. ఇక, ఏప్రిల్‌లో భారత ఎగుమతులు గతేడాది ఇదే నెలతో పోలిస్తే మూడు రెట్లు పెరిగి రూ. 2.21 లక్షల కోట్లకు పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రత్నాలు, ఆభరణాలు, జూట్, కార్పెట్, హ్యాండీక్రాఫ్ట్స్, లెదర్, ఎలక్ట్రానిక్, ఇంజనీరింగ్, ఇంకా ఇతర వస్తువులు ప్రధాన ఎగుమతి వస్తువులుగా నిలిచాయి. ‘ఎగుమతుల వృద్ధి ప్రోత్సాహకరంగా ఉందని, ఎగుమతిదారులు సానుకూలమైన ఆర్డర్లను సాధిస్తున్నారని’ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌ఫోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎస్ కె సరాఫ్ చెప్పారు.


Next Story