రక్షణ సామాగ్రి ఎగుమతుల్లో టాప్-25‌లో భారత్.. రాజ్ నాథ్ సింగ్

by  |
raj nath singh
X

దిశ, న్యూఢిల్లీ: గత ఏడేళ్లలో రూ.38,000 కోట్ల విలువ చేసే రక్షణ సామాగ్రిని విదేశాలకు ఎగుమతి చేశామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఎగుమతులు చేసేలా మారుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ సదస్సులో శనివారం ఆయన ప్రసంగించారు. ‘మన దగ్గర రూ.85000 కోట్ల విలువ చేసే వైమానిక, రక్షణ పరిశ్రమలు ఉన్నాయని అంచనా వేస్తున్నాం. దీనిలో ప్రైవేటు రంగం ప్రాతినిధ్యం రూ.18000 కోట్లకు పెరిగింది’ అని తెలిపారు. చిన్న పెద్ద తరహా ఎంటర్ ప్రైజెస్‌లు జాతీయ భద్రతను బలోపేతం చేసే పరిశోధనలు, అధ్యయనాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

నూతన సాంకేతికతలను, కొత్త ఉత్పత్తులను తీసుకురావాలి. మీరు చిన్న స్థాయిలో ఉండి, పెద్ద అవిష్కరణలు చేయలేరని ఊహించకూడదు అన్నారు. ఇప్పటివరకు 12,000 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్ ప్రైజెస్ ప్రభుత్వ చొరవతో రక్షణ పరిశ్రమలో చేరాయని తెలిపారు. ఇప్పటివరకు భారత్ 70 దేశాల్లో ఎగుమతులు చేస్తుందని వెల్లడించారు. 2020 నివేదిక ప్రకారం రక్షణ సామాగ్రి ఎగుమతుల్లో భారత్ టాప్-25లో ఉందని గుర్తు చేశారు.


Next Story

Most Viewed