YS Jagan Mohan Reddy : సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో కీలక అప్‌డేట్

by Disha Web Desk 16 |
YS Jagan Mohan Reddy : సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో కీలక అప్‌డేట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారించాలన్న పోలీసుల పిటిషన్‌పై విచారించిన కోర్టు మూడు రోజుల పాటు ప్రశ్నించేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో నిందితుడు సతీశ్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలో పలు కోణాల్లో ప్రశ్నించారు. మూడు రోజుల కస్టడీ ముగియడంతో సతీశ్‌ను రిమాండ్‌కు తరలించారు. మే 2 వరకు సతీశ్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో సతీశ్‌ను పోలీసులు జైలుకు తరలించారు.

కాగా విజయవాడ సింగ్ నగర్‌లో సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టిన వేళ ఆయనపై గులకరాయితో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కంటికి పైభాగంలో గాయం అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిగా సతీశ్‌ను గుర్తించారు. ఏ2 ప్రోద్బలంతోనే సతీశ్ దాడి చేశారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు. అయితే ఈ కేసులో దుర్గారావు అనే వ్యక్తిని విచారించి వదిలేశారు. దీంతో ఏ2 ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Read More..

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..నారా లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్!



Next Story