టోక్యో ఒలంపిక్స్‌కు వెళ్లే షూటింగ్ జట్టు ప్రకటన

by  |
టోక్యో ఒలంపిక్స్‌కు వెళ్లే షూటింగ్ జట్టు ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలంపిక్స్ 2020కి వెళ్లే భారత షూటింగ్ జట్టును ది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ఆదివారం ప్రకటించింది. పురుషఉల జట్టుకు సౌరభ్ చౌదరి, మహిళల టీమ్‌కు ఎలవెనిల్, మనూ బాకర్ నేతృత్వం వహిస్తారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ అయిన ఎలవెనిల్ టోక్యో కోటాను గెలుచుకోలేదు. కానీ భారత జట్టు సంపాదించిన 15 కోటాల్లో ఒకటి ఆమెకు కేటాయించారు. అంజుమ్ మొద్గిల్ గెలిచిన కోటాను ఎలవెనిల్‌కు ఇచ్చారు. మహిళల 25 మీట్ల పిస్టల్‌లో చింకీ యాదవ్ గెలిచిన కోటాను అంజుమ్ మొద్గిల్‌కు కేటాయిస్తూ జాతీయ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నది.

పురుషుల టీమ్

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ : దివ్యాంష్ సింగ్ పన్వార్, దీపక్ కుమార్ రిజర్వ్ : సందీప్ సింగ్, ఐశ్వరి ప్రతాప్ సింగ్ తొమర్

50 మీటర్ల రైఫిల్ 3- పొజిషన్ : సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వరి ప్రతాప్ సింగ్ తొమర్, రిజర్వ్ : స్వప్నిల్ కౌషాలే, చైన్ సింగ్

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ : సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ రిజర్వ్: షాజర్ రిజ్వీ, ఓం ప్రకాశ్ మిథర్వాల్

స్కీట్ : అంగధ్ వీర్ సింగ్ బజ్వా, మిరాజ్ అహ్మద్ ఖాన్ రిజర్వ్: గుర్జోత్ సింగ్ ఖంగూరా, షీరజ్ షేక్

మహిళల టీమ్

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ : అపూర్తి చండేలా, ఎలవెనిల్ వలరివన్ రిజర్వ్ : అంజుమ్ మొద్గిల్, శ్రేయ అగర్వాల్

50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ : అంజుమ్ మొద్గిల్, తేజశ్విని సావంత్ రిజర్వ్ : సునిధి చౌహాన్, గాయత్రి నిత్యానందమ్

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ : మనూ భకర్, యశస్విని సింగ్ దేశ్వాల్ రిజర్వ్ : పి. శ్రీనివేథ, శ్వేత సింగ్

25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ : రాహీ సర్నోబాత్, మనూ భకర్ రిజర్వ్ : చింకీ యాదవ్, అభిజ్ఞ పాటిల్

మిక్స్‌డ్ టీమ్ :

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ : దివ్యాన్ సింగ్ పన్వార్, ఎలవెనిల్ వలరివన్, దీపక్ కుమార్, అంజుమ్ మొద్గిల్

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ : సౌరభ్ చౌదరి, మనూ భకర్, అభిషేక్ వర్మ, యశస్విని సింగ్ దేశ్వాల్

Next Story

Most Viewed