మొబైల్‌లోనే ‘బ్లడ్ ఆక్సిజన్’ లెవెల్స్

by  |
MobiHealth
X

దిశ, ఫీచర్స్: కొవిడ్ మరోసారి పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతుండగా, ప్రజలు పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, స్వీయరక్షణే శ్రీరామరక్షగా వైరస్‌తో సహవాసం చేయాల్సిందే. చిన్న అజాగ్రత్త కూడా మహమ్మారి సోకేందుకు కారణమయ్యే చాన్స్ ఉండగా.. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండేందుకు జనాలు పల్స్ ఆక్సీ‌మీటర్, గ్లూకో మీటర్, డిజిటల్ థర్మో మీటర్, బీపీ, షుగర్ వంటి గాడ్జెట్స్‌‌తో ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యస్థితిని చెక్ చేసుకుంటున్నారు. కాగా గాడ్జెట్స్ కొనలేని వారు మొబైల్‌లోనే ఈ ఫెసిలిటీ పొందేలా హెల్త్ స్టార్టప్ ఎంఫైన్.. ‘బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ మీటర్‌’‌ పేరుతో ఓ యాప్ తీసుకొచ్చింది.

హెల్త్ టెక్ స్టార్టప్ ‘ఎంఫైన్’ రూపొందించిన ఈ న్యూ యాప్.. మన మొబైల్‌నే ‘బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ మీటర్‌’లా మార్చేస్తుంది. ఎంపల్స్ ఓపెన్ చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్ కెమెరా, ఫ్లాష్ ఆన్‌ చేయాలి. వాటి మీద ఫింగర్ పెట్టగానే.. బ్లడ్ వెస్సెల్స్ నుంచి వచ్చే రెడ్, బ్లూ, గ్రీన్ లైట్ సంకేతాలను ఏఐ అల్గారిథమ్ గుర్తిస్తుంది. వాటి వ్యాల్యూమ్ ఆధారంగా కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే మన ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్‌ను లెక్కిస్తుంది. ఆ తర్వాత అనాలిసిస్ రిపోర్ట్‌ను కూడా చూపెడుతుంది. సాధారణంగా ఎస్‌పీఓ2 (SpO2) లెవెల్ 95 – 100 శాతం ఉండాలి. ఒకవేళ అంతకన్నా తక్కువుంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, చాతి నొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాగా గుండె జబ్బులు, స్లీప్ ఆప్నియా, గురక, ఆస్తమా, శ్వాసకోశ సంబంధత వ్యాధులు ఉన్నవారు తరచూ ఆక్సిజన్ సాచ్యురేషన్స్ వ్యాల్యూ లెవెల్ చెక్ చేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ యాప్ బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ ప్లాట్‌‌ఫామ్‌‌లో అందుబాటులో ఉండగా, ఐఓఎస్ యూజర్లకు త్వరలో రానుంది. ఈ మొబైల్ యాప్ దాదాపు 80% మెడికల్-గ్రేడ్ ఖచ్చితత్వంతో రిజల్ట్ చూపిస్తుందని ఎంఫైన్ తెలిపింది. భవిష్యత్తులో హార్ట్ రేటు, రక్తపోటును కొలవడానికి ఇతర మెడికల్ యాప్ -ఆధారిత సాధనాలను రూపొందించడానికి ఎంఫైన్ (MFine) యోచిస్తోంది.

Next Story

Most Viewed