నౌక కదిలింది.. కానీ, భారత సిబ్బందిపై చర్యలు?

by  |
నౌక కదిలింది.. కానీ, భారత సిబ్బందిపై చర్యలు?
X

న్యూఢిల్లీ : సూయజ్ కెనాల్‌లో ఎవర్ గివెన్ నౌక ఎట్టకేలకు కదలనైతే కదిలింది. కానీ, ఇప్పుడున్న ప్రధాన సవాలు.. అందులోని 25 మంది భారత సిబ్బందిని కెనాల్ అధికారులు ఏ విధంగా ట్రీట్ చేస్తారన్నదే. నేరపూరిత అభియోగాలు మోపడం సహా భారత సిబ్బందిపై ఏ తరహా చర్యలకు ఉపక్రమిస్తారోనని భారత ప్రభుత్వం, నావికా సిబ్బంది సంస్థలూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. షిప్పింగ్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ఎవర్ గివెన్ నౌక కెప్టెన్, మరికొందరు నౌకా సిబ్బందిని అక్కడి నుంచి ముందుకెళ్లకుండా కెనాల్ అధికారులు నిలిపేయవచ్చు. నౌక కెనాల్‌కు అడ్డంగా వచ్చి ఇరుక్కుపోయిన ఘటనపై దర్యాప్తు పూర్తయ్యే వరకు వారిని గృహ నిర్బంధించవచ్చు. ఈ యావత్ ఘటనకు నౌకా సిబ్బందిని బ్లేమ్ చేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నదని షిప్పింగ్ ఇండస్ట్రీలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

అసలు ఆ రాకాసి నౌక నేలను ఎలా తాకిందన్నది తేల్చాల్సి ఉన్నదని నేషనల్ షిప్పింగ్ బోర్డ్ సభ్యుడు కెప్టెన్ సంజయ్ పర్షార్ తెలిపారు. పరిశీలనలు, వోయేజ్ డేటా రికార్డర్‌లోని సంభాషనలు విని ప్రాథమిక నిర్ధారణకు రావచ్చునని వివరించారు. ఎవర్ గివెన్‌ నౌకలోని భారత సిబ్బందికి తాము అండగా నిలుస్తామని, ఎలాంటి సహాయానికైనా సిద్ధంగా ఉన్నామని నేషనల్ యూనియన్ ఆఫ్ సీఫేరర్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.



Next Story

Most Viewed