వ్యాక్సినే‌షన్‌లో ఇండియా ఎన్నో స్థానంలో ఉందంటే..

by  |
వ్యాక్సినే‌షన్‌లో ఇండియా ఎన్నో స్థానంలో ఉందంటే..
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. గతనెల 16న టీకా పంపిణీ ప్రారంభమైంది. కాగా తక్కవ కాలంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం యూఎస్‌, యూకేల తర్వాత అత్యధికులు టీకా పొందిన దేశంగా మూడో స్థానంలో భారత్ నిలవడం గమనార్హం. అమెరికా, యూకేల తర్వాత కరోనా టీకా అత్యధికులకు అందించిన దేశం భారతేనని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటి వరకు 57,75,322 మందికి టీకా వేసినట్టు తెలిపింది.

ఇందులో 53,04,546 మంది ఆరోగ్య సిబ్బంది, 4,70,776 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉన్నారని పేర్కొంది. వీరందరికి టీకా వేయడానికి 1,15,178 సెషన్లను నిర్వహించామని వివరించింది. కాగా, శనివారం ఒక్క రోజు 8,875 సెషన్‌లలో 3,58,473 మందికి టీకా వేసినట్టు తెలిపింది. ఎక్కువ మంది టీకా వేసుకున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్(6,73,542) ముందుందని, రెండు, మూడు స్థానాల్లో మహారాష్ట్ర(4,73,480), రాజస్థాన్‌(4,59,652)లున్నాయని వివరించింది.


Next Story