‘కరోనా నుంచి బయటపడాలంటే వృద్ధి అవసరం’

by  |
‘కరోనా నుంచి బయటపడాలంటే వృద్ధి అవసరం’
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ 10.5-11 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా కలిగే భారీ దుష్ప్రభావాలను అధిగమించేందుకు ఈ మేరకు వృద్ధి కొనసాగింపు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ సీఎస్ఆర్ నెట్‌వర్క్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనూహ్యంగా వచ్చిన కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఇదివరకు దేశం సిద్ధంగా లేదని, భవిష్యత్తులో మరోసారి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థికవ్యవస్థ 8 శాతం కుదించుకుపోయే అవకాశం ఉన్నట్టు రాజీవ్ చెప్పారు. ఆర్‌బీఐ 2021-22లో దేశ ఆర్థిక వృద్ధి 10.5 శాతంగా అంచనా వేస్తుండగా, ప్రధాన ఆర్థిక సలహాదారు కె.వి సుబ్రమణియన్ 11 శాతంగా వృద్ధిని అంచనా వేసిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థికవ్యవస్థ కోలుకునే స్థాయిలో దూసుకుపోతోందని అన్నారు.


Next Story

Most Viewed