దానికి సమయం పడుతుంది : ఇండియా రేటింగ్స్

by  |
దానికి సమయం పడుతుంది : ఇండియా రేటింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో బ్యాంకింగ్ రహిత ఆర్థిక సంస్థలైన ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలపై ప్రతికూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ గురువారం వెల్లడించింది. కొవిడ్-19 సంబంధిత పరిణామాల కారణంగా అంతరాయాలు ఏర్పడడంతో ప్రతికూలతను కొనసాగిస్తున్నట్టు ఏజెన్సీ వివరించింది. దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి వేగాన్ని పరిశీలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది.

జులై తర్వాత ద్రవ్యత, ఫండ్ విధాన వాతావరణంతో ఈ సంస్థల కార్యకలాపాలు మెరుగుపడినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభదాయకతను ప్రభావితం చేసే ఆస్తి నాణ్యత సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీలు నిధుల సేకరణపై దృష్టి సారించాయి. పూచీకత్తు విధానాలను కఠినతరం చేశాయి. కాబట్టి పోర్ట్‌ఫోలియో వృద్ధి మెరుగ్గానే ఉండోచ్చని అభిప్రాయపడింది. ఆర్‌బీఐ నిర్ణయాలతో క్రెడిట్ ఖర్చులపై కొంత ఉపశమనం ఉండొచ్చు. అయినప్పటికీ కొన్ని విభాగాల్లో ప్రతికూలత తప్పదు. దానివల్ల అధిక క్రెడిట్ ఖర్చులు ఏర్పడతాయని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.


Next Story