కాన్పూర్ టెస్ట్ : బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యంగ్ ప్లేయర్

125

దిశ, వెబ్‌డెస్క్ : కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యా్చ్ గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్ట్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. దీంతో ఈ మ్యాచ్‌కు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, వైస్ కెప్టెన్‌గా పూజరాను టీం మేనేజ్‌మెంట్ ఫైనల్ చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ టెస్టు‌ల్లో అరగ్రేటం చేశాడు. అయ్యార్‌కు మాజీ సీనియర్ ప్లేయర్ సునీల్ గవాస్కర్.. టెస్ట్ క్యాప్ అందించారు.

భారత జట్టు.. Shubman Gill, Mayank Agarwal, Cheteshwar Pujara, Ajinkya Rahane(c), Shreyas Iyer, Wriddhiman Saha(w), Ravindra Jadeja, Axar Patel, Ravichandran Ashwin, Ishant Sharma, Umesh Yadav

కివీస్ జట్టు.. Tom Latham, Will Young, Kane Williamson(c), Ross Taylor, Henry Nicholls, Tom Blundell(w), Rachin Ravindra, Tim Southee, Ajaz Patel, Kyle Jamieson, William Somerville.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..