రెండో ఇన్నింగ్స్: భారత్ 90/6

by  |
రెండో ఇన్నింగ్స్: భారత్ 90/6
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ చివరి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఈ టెస్ట్‌లోనూ ఎదైనా అద్భుతం జరిగితే తప్పా భారత్ ఓటమి లాంఛనమేనని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. దీంతో భారత్ 97 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టాప్ ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా.. ఏదో పని ఉన్నట్టు పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు పృథ్వీషా(14), అగర్వాల్(3) మరోసారి స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.
అనంతరం వచ్చిన నయా వాల్ పుజారా కొంతసేపు ప్రతిఘటించినా 24 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇక కెప్టెన్ కోహ్లీ కివీస్ టూర్ మొత్తంగా దారుణంగా విఫలమయ్యాడు. అతని కెరీర్‌లో ఇదో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. టీ20 సిరీస్‌లో 45, 11, 38, 11 వన్డే సిరీస్‌లో 51, 15, 19 టెస్ట్ సిరీస్‌లో 2, 9, 3, 14 మొత్తంగా కోహ్లీ కివీస్ పర్యటనలో చేసిన పరుగులు ఇవి. రెండో ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లతో కుదురుకున్నట్టు కనిపించినా 14 పరుగుల వద్ద గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 51 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
విదేశాల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న రహానే కూడా 9 పరుగులకే ఔట్ అవ్వడంతో భారత్ ఆశలు ఆవిరి అయ్యాయి. అనంతరం వచ్చిన ఉమేశ్ 1 పరుగుకే వెనుదిరిగాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పంత్ 1, విహారి 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మూడు రోజు ఆటలో వీరు రాణిస్తేనే మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోవచ్చు.
ఇక, కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో మరోసారి రాణించాడు. సౌథీ, గ్రాండ్ హోం చెరో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు అలౌట్ అయిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed