ఐడీబీఐ బ్యాంక్ నికర లాభం రూ. 324 కోట్లు

by  |
ఐడీబీఐ బ్యాంక్ నికర లాభం రూ. 324 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐడీబీఐ(IDBI) బ్యాంక్ రూ. 324.40 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు రూ. 3,459 కోట్ల నష్టాలను వెల్లడించింది. అలాగే, తొలి త్రైమాసికంలో వెల్లడించిన రూ. 144 కోట్ల నికర లాభాలతో పోలిస్తే ఈసారి 125 శాతం లాభాలు పెరిగాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 7.5 శాతం క్షీణించి రూ. 5,761.06 కోట్లకు చేరిందని, గతేడాది ఇది రూ. 6,231.02 కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు పేర్కొంది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 4 శాతం పెరిగి రూ. 1,695 కోట్లకు చేరుకుందని, నికర వడ్డీ మార్జిన్ 2.33 శాతం నుంచి 2.70 శాతానికి చేరుకుందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. సెప్టెంబర్ చివరి నాటికి ఎన్‌పీఏలు 25.08 శాతానికి తగ్గాయని, నికర ఎన్‌పీఏలు 5.97 శాతం నుంచి 2.67 శాతానికి మెరుగుపడినట్టు బ్యాంకు పేర్కొంది.



Next Story

Most Viewed