కొత్త రూల్స్‌తో కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్..

by  |
ICICI Bank New Rules
X

దిశ,వెబ్‌డెస్క్ : దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. క్యాష్ విత్‌డ్రాయెల్స్, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్, చెక్ బుక్ చార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. సేవింగ్స్ ఖాతాలకు కొత్త రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. నగదు ఉపసంహరణ, చెక్‌ బుక్ లీవ్స్‌‌, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు సంబంధించిన సేవలకు వసూలు చేసే ఛార్జీలను ఆ బ్యాంక్ సవరించింది. ఈ సవరించిన కొత్త రూల్స్‌తో కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. ఛార్జీల మోత, ఫైన్స్, వంటి కొత్త నిబంధనలతో కస్టమర్లను ఇరకాటంలోకి నెట్టింది. ఒక నెలలో గరిష్ఠంగా నాలుగు నియమాలతో కూడిన నగదు లావాదేవీలు అనగా జమ , ఉపసంహరణను ఉచితంగా జరిపేందుకు బ్యాంకు అవకాశం ఇచ్చింది. అనంతరం ప్రతి అదనపు లావాదేవీపై రూ.150 ఛార్జీ వర్తిస్తుంది.

ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో నాన్‌ ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో జరిపే తొలి మూడు లావాదేవీలు ఉచితం.ఇతర ప్రాంతాల్లో తొలి ఐదు లావాదేవీలు ఉచితం. తర్వాత ప్రతి అదనపు ఆర్థిక లావాదేవీకి రూ.20, ఆర్థికేతర లావాదేవీకి రూ.8.50 ఛార్జీ వసూలు చేయనున్నారు. ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డిపాజిట్ చేస్తే నెలలో తొలి ట్రాన్సాక్షన్‌కు చార్జీలు ఉండవు. తర్వాత రూ.1000కి రూ.5 పడుతుంది. అలాగే బ్యాంక్ ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ చార్జీలు కూడా సవరించింది. అంతే కాకుండా నెలవారీ కనీస సగటు బ్యాలెన్స్‌(మంత్లీ మినిమమ్‌ యావరేజ్‌ బ్యాలెన్స్‌-ఎంఏబీ) ఖాతాలో సరిగా మెయింటెన్‌ చేయనట్లైతే బ్యాంకు బ్రాంచి లేదా బ్యాంక్‌ క్యాష్‌ రీసైక్లర్‌ మెషిన్లలో జరిపే తొలి రెండు ఉచిత ఆర్థిక లావాదేవీలకు రూ.100ల రుసుము వసూలు చేయనున్నారు. తర్వాత జరిపే ప్రతి అదనపు లావాదేవీకి రూ.125లు రుసుము వర్తిస్తుంది. బ్యాంక్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఆగస్ట్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది.



Next Story

Most Viewed