వారి విడుదల కోసం ప్రార్థిస్తున్నా.. : కేంద్ర రక్షణ మంత్రి

by  |
వారి విడుదల కోసం ప్రార్థిస్తున్నా.. : కేంద్ర రక్షణ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు నిర్బంధం నుంచి వీలైనంత త్వరగా విడుదల కావాలని ప్రార్థిస్తున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. విడుదలయ్యాక కశ్మీర్‌లో పరిస్థితులు మరింత మెరుగుపరచడంలోనూ వారు భాగస్వాములు కావాలని ఆశిస్తున్నట్టు వివరించారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు గతేడాది ఆగస్టులో ఈ ముగ్గురిపై కేంద్రం నిర్బంధం విధించింది. ఇప్పుడు ఈ ముగ్గురు ప్రజా భద్రత చట్టం(పీఎస్ఏ) కింద నిర్బంధంలో ఉన్నారు. వీరి నిర్బంధం పై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇటీవలే గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంలోనూ తమ నాయకులను విడుదల చేస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామని ఎన్‌సీ, పీడీపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల అధికారిని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

కేంద్ర సర్కారు నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఆర్టికల్ 370 రద్దు కశ్మీరీలో సంక్షేమం కోసమేనని మంత్రి వివరించారు. దీన్ని అందరు కచ్చితంగా స్వాగతించాల్సిందేనని అన్నారు. కశ్మీర్‌లో శాంతి కొనసాగుతున్నదని, అభివృద్ధి త్వరితగతిన జరుగుతున్నదని తెలిపారు. వీటితోపాటు నిర్బంధంలో నుంచి నేతల విడుదలపైనా తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎవరినీ వేధించలేదని అన్నారు.

Next Story

Most Viewed