ట్విట్టర్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఈసారి హైదరాబాద్ పోలీసులు

by  |
Hyderabad Cyber ​​Crime Police issued notices to Twitter
X

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటీకే కొత్త డిజిటల్ చట్టాలను ఉద్దేశపూర్వకంగా అమలుజేయడాన్ని తిరస్కరిస్తున్నదన్న ఆరోపణలతో ట్విట్టర్‌కు లీగల్ ప్రొటెక్షన్‌ను రద్దు చేసినట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించిన సంగంతి తెలిసిందే. ఇక లీగల్ ప్రొటెక్షన్‌ను రద్దు చేసిన కొద్దీ గంటలోనే ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో థర్డ్ పార్టీకి సంబంధించిన మొదటి కేసు నమోదైన విషయం మరువకముందే హైదరాబాద్ పోలీసులు ట్విటర్‌కు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఫేక్ వీడియో సర్కులేట్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్ కి నోటీసులు జారీ చేశారు. అనుచిత వ్యాఖ్యలకు ట్విట్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని నిబంధనలు చెప్తున్నా ట్విట్టర్ వాటిని ఫాలో కాలేదని ఆరోపించారు.

Next Story