మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

by  |
Hyderabad Metro Trains
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటినుంచి ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9 గంటలకు కాకుండా 9.45 గంటలకు బయలుదేరి రాత్రి 10.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. శుక్రవారం నుంచి పెంచిన సమయాలు అమల్లోకి రానున్నాయి. రాత్రి ఆలస్యంగా ఆఫీసుల్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేవారి కోసం మెట్రో రైలు సమయాలను పెంచినట్లు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ కేవీబీరెడ్డి చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా మెట్రో రైళ్లల్లో మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటించని ప్రయాణికులకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed