వన్య మృగాల మనుగడతోనే మానవుల మనుగడ:  ఇంద్రకరణ్ రెడ్డి     

by  |
Indrakaran Reddy
X

దిశ, బహదూర్ పురా : వన్య మృగాల మనుగడ పైనే మానవుని మనుగడ ఆధారపడి ఉందని పర్యావరణంతో పాటు వన్య మృగాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నెహ్రూ జూలాజికల్ పార్క్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బహదూర్ పుర ఎమ్మెల్యే మోజం ఖాన్, స్థానిక టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు. జూలాజికల్ పార్క్ అధికారులు నూతనంగా ప్రారంభించిన ఏసీ సఫారీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్న 200 సిసి కెమెరాలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. కొత్తగా వచ్చిన నాలుగు వైల్డ్ డాగ్ లను కూడా పర్యాటకుల సందర్శన కోసం మంత్రి చేతుల మీదుగా ఎన్క్లోజర్ లోకి వదిలి పెట్టడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… జూ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అన్ని సదుపాయాలను కల్పించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన అన్నారు. పక్షులకు సంబంధించిన ఏవి ఆరిస్ ప్రాజెక్టును కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగిందని సూచించారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా మన హైదరాబాద్ కు చెందిన నెహ్రూ జూలాజికల్ పార్క్ కు ఐఎస్ఓ 14001 సర్టిఫికెట్ రావడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. వన్యమృగాల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగానే 200 సిసి కెమెరాలను ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అందుకు అనుగుణంగానే ఏసీ సఫారీ బస్సులను నూతనంగా ప్రారంభించడం జరిగిందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పి సి సి ఎఫ్ శోభ, క్యూరేటర్ రాజశేఖర్ పలువురు అధికారులు జూ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed