దెబ్బలు తినడమే వృత్తి.. ఎంత కొట్టుకుంటారో కొట్టుకోండి..!

by  |
Stress coach
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఎవరైనా ‘కోపం’ తెప్పిస్తే.. ఆ వ్యక్తిని ఫుల్లుగా కుమ్మేయాలనే ఆలోచన వస్తుంది కానీ ఆ పని చేయలేం. కొందరు ఆ కోపాన్ని వస్తువుల మీద ప్రదర్శిస్తే, ఇంకొందరు పంచింగ్ బ్యా్గ్‌పై తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే టర్కీకి చెందిన ఓ వ్యక్తి.. అక్కడి ప్రజలు తమ స్ట్రెస్, కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు గాను తనకు తానుగా పంచింగ్ బ్యాగ్‌ అవతారమెత్తి ‘స్ట్రెస్ కోచ్’గా మారిపోయాడు. 11 ఏళ్లుగా తనను కొట్టేందుకు ప్రజలను అనుమతిస్తూ ఈ విధంగా జీవనోపాధి పొందుతున్నాడు.

టర్కిష్ కామెడీ ఫిల్మ్ ‘సార్క్ బుల్‌బులు’(ఈస్టర్న్ నైటింగేల్)తో ప్రేరణ పొందిన ‘హసన్ రిజా గునాయ్’ అనే వ్యక్తి.. 2010లో ‘హ్యుమన్ పంచింగ్’ బ్యాగ్‌గా పనిచేయడం ప్రారంభించాడు. నిజానికి వ్యాయామం, ధ్యానం లేదా నిద్రపోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుంటారు. చివరకు అరవడం నుంచి కూడా స్ట్రెస్ రిలీఫ్ పొందుతారు. అయితే ఎవరినైనా కొట్టడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చని హసన్ గ్రహించాడు. దీంతో కొంత అపరిచితులకు డబ్బు ఇచ్చి మరీ వారితో దెబ్బలు తినేందుకు హసన్ సిద్ధమయ్యాడు. క్రమంలో దాన్నే ఒక వ్యాపారంగా మార్చుకున్న అతడు.. ‘స్ట్రెస్ కోచ్’గా పేరుతెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇదే విద్యలో ఇతరులకు శిక్షణ ఇవ్వాలని ఆశిస్తున్నాడు.

Human Punching Bag

భయాన్ని బయటకు తరిమేయడం కోసమే..

కోపంలో ఉన్న వారికి కావలసిందల్లా వారి కోపాన్ని తగ్గించుకునే సాధనం మాత్రమే. అందుకే తన క్లయింట్ ఏ వ్యక్తి వల్ల బాధపడ్డాడో ముందుగా తెలుసుకుని, అతడి ఫొటోను తన ముఖానికి ముసుగులా ధరిస్తాడు. ఈ క్రమంలో తనను కొట్టేందుకే కాక బూతులు తిట్టేందుకు కూడా తన క్లయింట్స్‌కు అనుమతిస్తాడు. వారి నిరాశ, నిస్పృహలతో పాటు భయాన్ని కూడా బయటికి పంపేందుకు వారిని ప్రోత్సహిస్తాడు.

వృత్తిలో భాగంగా వాళ్లు నన్ను కొడితే అవమానంగా ఫీల్ కాను. తిట్టిన తిట్లను కూడా ఏమాత్రం పట్టించుకోను. ఇదంతా సినిమాల్లో నటన వంటిదే. నా క్లయింట్స్‌లో ఎక్కువ శాతం ఆడవారే. ప్రతీ సెషన్‌కు 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయిస్తాను. రోజుకు నలుగురు క్లయింట్స్‌ను మాత్రమే అంగీకరిస్తాను. డిప్రెషన్ లేదా తీవ్ర భయాందోళనలతో బాధపడుతున్న వారిని ఈ విధంగా ఒత్తిడి నుంచి బయటపడేస్తాను.
– హసన్, స్ట్రెస్ కోచ్



Next Story

Most Viewed