ఫోన్ బ్యాటరీ ఆదా ఇలా..

by  |
ఫోన్ బ్యాటరీ ఆదా ఇలా..
X

రోజూ వాడే కొన్ని అప్లికేషన్లు భారీ మొత్తంలో ఫోన్ బ్యాటరీ వినియోగించుకుంటాయి. వాస్తవానికి వాటిని వదిలిపెట్టి ఉండలేం.. ఒకవేళ వాటిని తొలగిస్తే ప్రస్తుతం లభిస్తున్న బ్యాటరీ బ్యాకప్​ కంటే రెట్టింపు బ్యాటరీ లైఫ్ పొందవచ్చు. Android, iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లు వాడే వినియోగదారుల బ్యాటరీని ఎక్కువగా వినియోగించే కొన్ని అప్లికేషన్స్​ ఏమిటో తెలుసుకుందాం.

స్నాప్​చాట్​ (snapchat)

ఈ మధ్య కాలంలో ఇండియాలో స్నాప్‌చాట్ వినియోగం బాగా పెరిగింది. ఫోన్ బ్యాటరీని భారీగా ఖర్చు చేసే అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్లో ఉండే నోటిఫికేషన్ సర్వీస్ ఎప్పటికప్పుడు ఫోన్​ని స్లీప్ మోడ్‌లో ఉండకుండా దాన్ని నిద్ర లేపుతూ భారీ మొత్తంలో బ్యాటరీ ఖర్చు కావడానికి కారణమవుతుంది. దీని నోటిఫికేషన్స్ డిజేబుల్ చేయటం ద్వారా, లోకేషన్ ఆఫ్ చేయడం ద్వారా కొంతవరకు బ్యాటరీ సేవ్​ చేసుకోవచ్చు. స్నాప్‌చాట్ పూర్తిగా అన్​ ఇన్​స్టాల్​ చేయడం ద్వారా మరింత ఎక్కువ బ్యాటరీని పొందొచ్చు. దీంతోపాటు ఫోన్​ లైఫ్​‌టైం కూడా పెంచుకోవచ్చు.

నెట్​ఫ్లిక్స్​ (Netflix)

బ్యాటరీని ఎక్కువగా ఖర్చు చేసే రెండో అప్లికేషన్ నెట్​ఫ్లిక్స్​. ఇది కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ సర్వీస్ బ్యాక్​ గ్రౌండ్​లో రన్ చేస్తూ బ్యాటరీని ఫుల్​గా వాడేస్తుంది. నెట్​ఫ్లిక్స్​ ద్వారా వీడియోలు, మూవీస్​ చూసేటప్పుడు తెలీకుండానే పెద్ద మొత్తంలో బ్యాటరీ యూజ్​ అవుతుంది. ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవాలంటే నెట్​ఫ్లిక్స్​ని తొలగించి సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూడాలంటే స్మార్ట్ టీవీ ద్వారా కానీ, కంప్యూటర్ ద్వారా చూడటం మంచిది.

యూ ట్యూబ్​ (Youtube)

మిగతా స్ట్రీమింగ్ యాప్స్ మాదిరిగానే యూ ట్యూబ్ కూడా పెద్ద మొత్తంలో బ్యాటరీని వినియోగించుకుంటుంది. యూట్యూబ్​లో అంతర్గతంగా ఉండే సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవటం ద్వారా యూట్యూబ్ మీద గడిపే సమయాన్ని పరిమితం చేసుకోవచ్చు. ఇది ఎప్పటికప్పుడు అనేక రకాల బ్యాక్ గ్రౌండ్ సర్వీసులను రన్ చేయడం ద్వారా బ్యాటరీ ఎక్కువ ఖర్చు కావడానికి కారణమవుతుంది.

ఫేస్​బుక్​ (Facebook)

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వాడే సోషల్ నెట్​వర్కింగ్​ అప్లికేషన్ ఫేస్​బుక్​. ఇది ఎప్పటికప్పుడు బ్యాక్​గ్రౌండ్​లో రన్ అవుతూ ఉంటుంది. అప్​డేట్లను సింక్రనైజ్ చేస్తూ నోటిఫికేషన్ సర్వీస్‌తోపాటు అనేక రకాల ఇతర బ్యాక్​గ్రౌండ్​ సర్వీసులను రన్ చేస్తూ ఉంటుంది. దీంతో భారీగా బ్యాటరీ వినియోగించుకుంటుంది. ఫేస్​బుక్​ మెసెంజర్ అప్లికేషన్ కూడా బ్యాక్​గ్రౌండ్​లో రన్ అవుతూ, ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ చూపిస్తూ బ్యాటరీ ఎక్కువ ఖర్చు కావటానికి దోహదపడుతుంది.

ఇవి మాత్రమే కాకుండా టిక్‌టాక్, వాట్సాప్, ఓలా, ఉబర్ వంటి అప్లికేషన్లు కూడా భారీ మొత్తంలో బ్యాటరీ వినియోగించుకున్నట్లు తాజా స్టడీ ద్వారా వెల్లడైంది. ఒకవేళ ఈ అప్లికేషన్స్ లేకుండా మీరు ఉండగలిగితే వాటిని ఫోన్ నుంచి తొలగించుకోవడమే మంచిదని చెబుతున్నారు టెక్​ ఎక్స్​పర్ట్​ నల్లమోతు శ్రీధర్​.

tags : facebook, snapchat,youtube, netflix, whatsapp,how to save phone battery using social apps

Next Story

Most Viewed