నేటి నుంచి హోటళ్లు, షాపింగ్ మాల్స్ ఓపెన్

by  |
నేటి నుంచి హోటళ్లు, షాపింగ్ మాల్స్ ఓపెన్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని పాటించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా గుళ్ళు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలు, షాపింట్ మాల్స్, హోటళ్ళు, రెస్టారెంట్లు లాంటివన్నీ నేటి నుంచి తెరుచుకోనున్నాయి. సుమారు 70 రోజుల తర్వాత మళ్లీ అవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా నేటి నుంచి ఇవి తెరుచుకోడానికి అనుమతి ఇచ్చింది. అయితే చిన్నపిల్లలు, 65 ఏళ్ళ వయసు దాటిన వృద్ధులు మాత్రం గుళ్లల్లోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఇప్పటికే పలు ఆలయాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. షాపింగ్ మాల్స్ కూడా పిల్లలు, వృద్ధులకు అనుమతి నిరాకరిస్తూ ప్రవేశ ద్వారాల దగ్గర బోర్డులు ఏర్పాటు చేశాయి. ప్రభుత్వం సైతం పిల్లలు, వృద్ధులు ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని, తప్పనిసరి అవసరాలకు మాత్రమే బైటకు రావాలని సూచించింది.


Next Story

Most Viewed