విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై టీడీపీ హాస్టల్ సందర్శన.. 

by  |
విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై టీడీపీ హాస్టల్ సందర్శన.. 
X

దిశ, ఫరూక్ నగర్: ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుద్ధ్యం తప్పనిసరిగా ఉండాలని, అదేవిధంగా వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని చటాన్ పల్లి లో గల ప్రభుత్వ బిసి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర వసతి గృహంలో తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై ఆయన స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే ఎలుకలు బొద్దింకలు పందికొక్కులు చేరుతాయని ఆయన పేర్కొన్నారు. చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.



Next Story

Most Viewed