కలలో శ్రీరాముడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

by Disha Web Desk 8 |
కలలో శ్రీరాముడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కలలు రావడం అనేవి సహజం. ప్రతీ ఒక్కరు కలలు కంటుంటారు. కొందరు రాత్రి వేళల్లో కలలు కంటే, మరికొందరు పంగటి వేళల్లో కలలు కంటుంటారు.అంతే కాకుండా కలలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని మంచి చేసే కలలు ఉంటే, ఇంకొన్ని చెడు చేస్తాయి అంటారు.అలాగే జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా కలల్నిభావిస్తారు. ఇక కలలో జంతువులు, పక్షులు ఇలా ఎన్నో కనిపిస్తాయి. కానీ కలలో రాముడి కనిపిస్తే.

అవునండీ.. ప్రస్తుతం అంతా రామమయం అయిపోయింది. ప్రతీ ఒక్కరూ ఆ రామనామ జపంతో భక్తిలో మునిగిపోయారు. కోట్లాది మంది ఎన్నోఏళ్లగా ఎదురుచూస్తున్న కల అయోధ్య రామమందిరం. ఆ కల నిన్న నెరవేరింది. జనవరి 22న వేలకోట్ల మంది భక్తుల మధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దీంతో ఇప్పటికీ చాలా మంది ఆ శ్రీరాముడినే తలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత మందికి ఆ రామయ్య కలలోకి రావడం జరుగుతుంది. అయితే శ్రీరాముడు కలలోకి రావడం ఎలాంటి ఫలితాలనిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం రాముడు లేదా రామమందిరం మీ కలలో కనిపిస్తే, అది చాలా శుభ సంకేతంగా చెప్పబడుతుందంట. కలలో శ్రీరాముని చూడటం విజయాన్ని సూచిస్తుంది. చాలా కాలంగా మీరు కలలు కంటున్న కోరిక నెరవేరబోతుంది అన్నఅర్థం వస్తుంది అంటున్నారు స్వప్న శాస్త్ర పండితులు.



Next Story

Most Viewed