2023 శోభకృత్ నామ సంవత్సరం: ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో సమస్యలు తప్పవు

by Dishanational2 |
2023 శోభకృత్ నామ సంవత్సరం: ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో సమస్యలు తప్పవు
X

మీనరాశి

సారం గోచారము: మీన మాసములో పుట్టిన వారికి

చంద్రగోచారము : పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి

నామ నక్షత్రము: టీ, రూ., ఝ, డా. రే, దో, చా, చి,


ఆదాయ వ్యయాలు

ఆదాయం 8

వ్యయం 11

రాజపూజ్యం 1

అవమానం 2

గురువు : ఏప్రిల్ 22 వరకు 1న సువర్ణమూర్తి, వివాహాది శుభకార్యములు అతికష్టమున నెరవేరును. తదాది వత్సరపర్యన్తం 2న రజతమూర్తి. ఆర్థిక ఇబ్బందులు కొంత సర్దుకుంటాయి. మంచి చెడులు మిశ్రమంగా ఉండును.

శని : వత్సరపర్యన్తం 12న రజతమూర్తి. శ్రమతో కూడిన విజయం సిద్ధించును.

రాహువు: అక్టోబరు 30 వరకు 2న సువర్ణమూర్తి, విరోధాలు ఏర్పడినను, శ్రమ "మీద భార్యసిద్ధి యగును. తదాది వత్సరపర్యనం 1వ తామ్రమూర్తి. పలుకుబడి నష్టము కలుగును.

కేతువు : అక్టోబరు 30 వరకు 8న సువర్ణమూర్తి, శుభాశుభ మిశ్రమముగా ఉండును. తదాది వత్సరపర్యన్తం7న తమ్రామూర్తి, సమయానికి ఆదుకొనువారు ఉండురు.

ఏప్రిల్‌ తర్వాత శని 12లోనూ, గురువు 1 లోనూ, రాహువు 2వ ఇంటిలోనూ, కేతువు 8లోనూ సంచరి స్తున్నందువల్ల, మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆ తర్వాత విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం, ప్రమోషన్గు, ఆదాయం పెరుగుదల, పలుకుబడిగల వారితో పరిచయాలు, ఆకస్మిక ధనలాభం, శుభకార్యాలు, శుభవార్తలు వంటివి అనుభవానికి వస్తాయి. గురుబలం ఉన్నందున ఆదాయానికి లోటుండదు కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల మానసిక బాధలు తప్పవు.విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు శుభఫలితాలు పొందుతారు. వజ్ర విభాస, వస్తువుల వ్యాపారులకు బాగా అనుకూలం, సినీ, కళా రంగంలోని వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న గొప్ప స్థానాన్ని పొందుతారు. విశేష ఖ్యాతి గడిస్తారు. రాజకీయ కష్టమున నెరవేరును.రాజకీయ నాయకులకు వృత్తి బాధ్యతలకు, కుటుంబ ఆసక్తులకు పొంతన కుదరదు. ఆర్థికమైన ఒత్తిళ్ళకు పదవులు లభించును. వ్యాపారమున ఆశించిన లాభాలు కొంత తగ్గును. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చి ఇస్తారు. మీకు ఏలిన్నాటి శని ప్రారంభం అవుతోంది. జీవితంలో అనేక విషయాల్లో క్రమశిక్షణ ఏర్పడుతుంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాభ్యాసం కొంత కఠినంగా ఉంటుంది. కవులకు, పండితులకు రోజులు గడ్డుగా ఉన్నను, గౌరవ పురస్కారములు లభించును. ఋణ బాధలు పెరుగును. విరోధులు ఎక్కువ అవుతారు, ప్రయాణములు కలసి రావు. వివాహాది శుభకార్యములకు ఎక్కువ ఆటంకములు ముందుకు సాగుతారు. సోదరులు పరస్పరం సహాయము చేసుకుంటారు. అప్పు ఏర్పదును. కొన్ని వ్యవహారాలు చికాకు అనిపించును.

ఉద్యోగులు దూర ప్రాంతములకు వసూలు చేయటంలో నైపుణ్యాన్ని చూపిస్తారు. మార్కెటింగ్, పర్యాటక రంగాల వారికి బదిలీ అగుదురు. కుటుంబంలో చికాకులు, అశాంతి పెరుగుతాయి.ఆర్థిక స్థితిగతులను సమతూకంగా నిర్వహించుకోగలుగుతారు. అనవసర పరిచయాలకు దూర ౦గా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్ధులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమించినవారితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. సంతాన యోగం ఉంది. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవచన రంగాల్లో ఉన్నవారు, ఆలయ సిబ్బంది, యోగా, సంగీతం తదితర రంగాలలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఊహించని విధంగా ధన సంపాదన పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మెరుగుదల ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. రుణ సమస్యలు బాగా తగ్గుతాయి. వడ్డీ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. అనవసర ఖర్చుల్ని విలాసాలను బాగా తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది.

ఇవి కూడా చదవండి:

శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Next Story

Most Viewed