2023 పంచాంగం : ఉగాది తర్వాత ఈ రాశి వారి జీవితం కొత్త మలుపు తిరగనుంది

by Dishanational2 |
2023 పంచాంగం : ఉగాది తర్వాత ఈ రాశి వారి జీవితం కొత్త మలుపు తిరగనుంది
X

మిథున రాశి

సార గోచారము : మిధున మాసములో పుట్టిన వారికి

చాంద్ర గోచారము : మృగ 3,4: ఆర్ద్ర, పునర్వసు 1,2,3

నామ నక్షత్రము: కా, కి, కూ, ఖం, బృ,చ్ఛ, కే, కో, హ

ఆదాయ వ్యయాలు

ఆదాయం 2

వ్యయం 11

రాజపూజ్యం 2

అవమానం 4

గురువు : ఏప్రిల్ 22 వరకు 10న తామ్రమూర్తి. కొద్దిపాటి నష్టంతో అన్ని పనులు నెరవేరుతాయి.తదాది వత్సరపర్యన్తం 11న సువర్ణమూర్తి. అన్నిరంగముల యందు శుభాధిక్యత పెరుగును.

శని : వత్సరపర్యస్త్రం 9న సువర్ణమూర్తి, అన్ని ప్రయత్నములందు ఊహించిన విజయం చేకూరగలదు.

రాహువు : అక్టోబరు 30 వరకు 11న సువర్ణమూర్తి. అన్ని రంగములయందు శుభాధిక్యత పెరుగును. తదాది వత్సరపర్యద్రం 10న లోహమూర్తి. అన్ని రంగములలో అడ్డంకులు ఏర్పడును.

కేతువు : అక్టోబర్ 30 వరకు5న తామ్రమూర్తి. ఊహించని మానసిక చికాకులు ఎక్కువగును. తదాది వత్సరపర్యస్తం4న లోహమూర్తి. అనారోగ్య భావన మానసిక ఆందోళన పెరుగును.

ఈ సంవత్సరం భాగ్య స్థానంలో శనీశ్వరుడు, లాభ స్థానంలో గురువు, లాభ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల, ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది.ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుని జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది.ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ప్రమోషన్లు ఆగిపోవడం, జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగా లేకపోవడం వంటివి జరగవచ్చు. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు, దశాంతర్జశలు బాగున్నట్టయితే, కష్టనష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది.మంచి ఉద్యోగం లభించడం లేదా మంచి ఉద్యోగంలోకి వెళ్లడం, తద్వారా జీవితంలో ఆర్థికంగా స్థిర పడటం వంటివి జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.ఇతరులతో పోటీపడి చేసే పనులలో విజయావకాశలు తక్కువ ఉంటాయి.విద్యార్థుల విద్యా వ్యాసంగానికి అవరోధాల ఏర్పడును. కుటుంబంలో చికాకుకు ఏర్పడుతాయి. సైన్సు రంగము వారికి ఎక్కు అభివృద్ధి, గుర్తింపు కలుగును, ద్వితీయార్ధంలో స్నేహితుల సహాయ సహకారముల బాగుగా లభించును. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుస్తుంది. సంతానమును అభివృద్ధి కలుగును.

కాంట్రాక్టు పనుల వలన లాభములు, భూమి కొనుట, పద లాభము సిద్ధించును.పిల్లల వివాహాది శుభకార్యములు నెరవేరుస్తారు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గి, ఇతర విషయముల మీద శ్రద్ధ పెరుగుతుంది. నేత్ర, శిరోరోగ బాధలు కలుగును, వాహన ప్రమాదములు కలుగు సూచనలున్నాయి. కోర్టు వ్యవహారములు స్తంభించును. శక్తికి మించిన కార్యములు చేయవలసివచ్చును. మాసాంతమున పెద్దలతో ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యాలు, అనుకోని ఖర్చులు, ఆదాయంలో తగ్గుదల వంటి సమస్యల నుంచి కాస్తంత బయటపడతారు. అయితే, ఇష్టం లేని ప్రాంతాల్లో స్థాన చలనం, సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. పని విషయంలో పై అధికారుల నుంచి విమర్శలకు అవకాశముంది. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అచితూచి అడుగువేయడం మంచిది. నిరుత్సాహానికి గురయ్యే సూచనలున్నాయి. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు.వాహన సౌఖ్యం, సంఘంలో పేరు, రాజకీయ నాయకుల పరిచయము, ప్రభుత్వ అధికారులతో సఖ్యత, వ్యాపార మందు సంతృప్తి ఈ మాసంలో కలుగును. కుటుంబ సౌఖ్యము పెరుగును, ఆర్థికాభివృద్ధి గత మాసము కంటే మేలు. అప్పుల బాధ తగ్గుతుంది. తగాదాలు తీర్చుట, సంఘంలో మంచి కీర్తిని గడించగలరు. నిరుద్యోగులకు ఉపాధి లభించును. అపూర్వ వస్తు సంప్రాప్తి, కీర్తి ప్రతిష్ఠలు, మిత్రుల ప్రోత్సాహం, ఉద్యోగములలో రాణింపు, గృహ నిర్మాణములు చేపడతారు. పాత బకాయిలు వసూళ్ళు అవుతాయి.ద్వితీయార్ధం నుండి అనుకున్న పనులు అనుకున్నట్లు సాగను. ఆత్మీయుల కొందరి ధోరణులు, నిర్ణయాలు మీకు నచ్చకపోవచ్చును.

ఇవి కూడా చదవండి :

శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Next Story

Most Viewed