ఇంగ్లీష్ మీడియంపై జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

by  |
ఇంగ్లీష్ మీడియంపై జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మొట్టికాయలు తగులుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక జీవోని తేవడం, దానిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం, లేదా విపక్షాలు కోర్టుని ఆశ్రయించడం విచారణ సందర్భంగా న్యాయస్థానం మొట్టికాయలు వేయడం సర్వసాధారణంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం విద్యపై ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

దీనిపై ఇంద్రనీల్ అనే న్యాయవాది వాదిస్తూ… ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులే తీసుకుంటారని కోర్టుకు విన్నవించారు. ఇంగ్లీష్ మీడియం వల్ల బ్యాక్ లాగ్లు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, జీవో 85లను హైకోర్టు కొట్టి వేసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags: andhrapradesh, english medium, telugu medium, high court, ysrcp, jagan

Next Story

Most Viewed