తవ్వకాల్లో బయటపడ్డ గుప్తనిధులు..

by  |
తవ్వకాల్లో బయటపడ్డ గుప్తనిధులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయి. ఉత్తమేరుర్ కుళంబేశ్వరాలయంలో మరమ్మత్తు పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గుప్తనిధులు వెలుగులోకి వచ్చాయి. అందులో బంగారు నాణేలు, నగలు, కనిపించడంతో సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. అవి సుమారుగా రెండు కిలోలు ఉంటాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. గుప్తనిధులపై ఆలయ ట్రస్టు బోర్డు, ప్రభుత్వం మధ్య వివాదం నెలకొంది.

ఈ నిధి దేవాదాయశాఖకు చెందుతుందని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తుండగా, ఈ ఆలయం దేవాదాయశాఖ అండర్‌లో లేదని ఆలయ ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. ఇవి ముమ్మాటికీ ఆలయానికి చెందుతాయని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు. పురాతన ఆలయం కావడంతో అలా కుదరదని ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. దీంతో కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని కుళంబేశ్వరాలయం ట్రస్టు స్పష్టంచేసింది. కాగా, ప్రస్తుతం ఆలయంలో తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Next Story

Most Viewed