హార్లీ డేవిడ్సన్ బైకులను అమ్మనున్న హీరో

by  |
హార్లీ డేవిడ్సన్ బైకులను అమ్మనున్న హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్నేళ్లుగా అమ్మకాలు లేక, ఈ ఏడాది కరోనా సంక్షోభంతో డీలాపడిన లగ్జరీ బైక్ తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ భారత్‌లో కార్యకలాపాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌ లో తిరిగి కొనసాగేందుకు దేశీయ దిగ్గజ టూ-వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్‌ తో హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశీయంగా హార్లీ మోటార్ బైక్‌ లను, యాక్సెసరీస్‌ ను విక్రయించేందుకు, డీలర్ నెట్‌వర్క్‌ లను నిర్వహించేలా హీరో మోటోకార్ప్‌ తో హార్లీ కంపెనీ ఒప్పందం ఖరారు చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హార్లీ డేవిడ్సన్ ప్రీమియం బైక్‌ లను హీరో సంస్థ విక్రయిస్తుంది.

ఈ భాగస్వామ్యం భారత్ ‌లోని కంపెనీతో పాటు వినియోగదారులకూ పరస్పర ప్రయోజనాలుంటాయి. ఐకానిక్ హార్లీ డేవిడ్సన్ బ్రాండ్‌ ను పటిష్టమైన పంపిణీ నెట్‌వర్క్ కలిగిన హీరో మోటోకార్ప్, వాహనదారులకు మెరుగైన సేవలందిస్తుందని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్ చెప్పారు. 11 ఏళ్ల పాటు భారత్‌ లో కార్యకలాపాలను నిర్వహించిన హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తి, అమ్మకాలు దారుణంగా క్షీణిస్తున్న కారణంగా సెప్టెంబర్‌ లో నిష్క్రమించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, కరోనా ప్రభావం నుంచి కోలుకోని కారణంగా హార్లీ డేవిడ్సన్ ఆదాయం 9.8 శాతం క్షీణించినట్టు వెల్లడించింది.



Next Story