ఎస్ఈసీ హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

50

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సోమవారం ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్‌ విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. ఈనెల 17వరకు సంక్రాంతి సెలవులు ఉండటంతో ఈనెల 18న తిరిగి రెగ్యులర్ కోర్టులో విచారణ జరగనుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..