వక్రీకృతాసనం (మొదటి పద్ధతి) ప్రయోజనాలేంటి?

by Disha Web Desk 6 |
వక్రీకృతాసనం (మొదటి పద్ధతి) ప్రయోజనాలేంటి?
X

దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై పిరుదులు కింద ఆన్చకుండా పాదాలపై కూర్చొని రిలాక్స్ అవ్వాలి. తర్వాత కుడికాలిని అలాగే ఉంచి ఎడమకాలి మోకాలు, పాదాన్ని ఎడమవైపు నేలపై పడుకోబెట్టాలి. పాదం పూర్తిగా భూమ్మీద ఆన్చాలి. ఇప్పుడు కుడి చేతిని కుడి మోకాలు మీదుగా వీపు వెనకాలకు తీసుకెళ్లాలి. ఎడమ చేతిని ఎడమవైపు నుంచి తీసుకెళ్లి కుడి చేతితో జతచేయాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి మళ్లీ కుడి కాలు నేలమీద ఆన్చి చేయాలి.

ప్రయోజనాలు :

* నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.

* రక్త ప్రసరణను పెంచుతుంది.

* వెన్నెముక కండరాలను బలపరుస్తుంది.

* జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది.


Next Story

Most Viewed