ఎక్కువ సేపు కూర్చొండి పని చేస్తున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డేటేనంట!

by Dishanational2 |
ఎక్కువ సేపు కూర్చొండి పని చేస్తున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డేటేనంట!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ వైపు మొగ్గు చూపుతున్నారు.కంప్యూటర్, ల్యాప్ టామ్ ముందు కూర్చొని చాలా మంది గంటల తరబడి పని చేస్తూనే ఉంటున్నారు. అయితే ఇలా సిస్టం ముందు ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంట. దీని వలన అనేక ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉందంట. అయితే కొంత మంది ఎనిమిదిగంటల కంటే ఎక్కువ సేపు కూర్చొని పని చేస్తుంటారు. ఇలా చేయడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరుతాయో ఇప్పుడు చూద్దాం.

కూర్చొని ఎక్కువ సేపు పని చేసేవారు గుండె జబ్బులు, హైబీపీ లాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదంట. అలాగే నిరంతరాయంగా కూర్చొని పని చేయడం వలన కాళ్లలో ఉండే రక్త నాళాల్లో రక్తం గడ్డకడుతుందంట.అంతే కాకుండా ఎముకలు బలహీనపడి ఆరోగ్యం దెబ్బ తింటుందంట. అందువలన వీలైనంత వరకు తక్కువ సేపు కూర్చొని పని చేయడానికి ప్రయత్నం చేయాలంటున్నారు వైద్యులు.

Next Story