కోవిడ్‌ కారణంగానే యువత గుండెపోటుకు గురవుతున్నారా..?

by Dishanational1 |
కోవిడ్‌ కారణంగానే యువత గుండెపోటుకు గురవుతున్నారా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎదురవుతున్న గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తూ, పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా రోజురోజుగా పెరుగుతున్నాయి. దీంతో కోవిడ్‌ కారణంగానే యువత ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోవిడ్ గుండెపోటుకు మధ్య సంబంధం ఉందేమోనని, కోవిడ్ టీకాలు కూడా వీటికి కారణాలేమోనని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ స్పందించారు. ‘చాలా మంది యువ కళాకారులను, అథ్లెట్లు, క్రీడాకారులు అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటనలు మనం చూశాం. ఈ ఘటనలపై కచ్చితంగా అధ్యయనం చేయాల్సి ఉంది. కోవిడ్‌, గుండెపోటు మధ్య సంబంధం ఉందేమో పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. దీని కోసం ఓ పరిశోధనను ప్రారంభించాం. దీని తాలూకూ ఫలితాలు రెండు లేదా మూడు నెలల్లో రావొచ్చు’ అని కేంద్రమంత్రి వెల్లడించారు.


Next Story