అరటి పువ్వు కూర ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..

by Disha Web Desk 6 |
అరటి పువ్వు కూర ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..
X

దిశ, వెబ్ డెస్క్: అరటి పండుతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అలాగే అరటి పువ్వుతో కూడా మంచి లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ కొంత మంది అరటిపువ్వు కూర తినడానికి ఇష్టపడరు. కానీ దీని లాభాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరని వైద్యులు అంటున్నారు. అరటి పువ్వు వల్ల ఎలాంటి వ్యాధులను నివారించ వచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

* డయాబెటీస్‌తో బాధపడేవారు అరటిపువ్వు కూరను తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి తగ్గి మంచి ఫలితం ఉంటుంది.

*అరటి పువ్వులో ఉండే ఫినోలిక్, ఆమ్లాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.

* కిడ్నీ సమస్యలు వేదిస్తే అరటి పువ్వు కూరను తినాలి. అలాగే అరటి పువ్వు లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తాయి.

*ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉన్నందున రక్తహీనత సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ పువ్వు కూరను డైట్‌లో చేర్చుకుంటే ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి.



Next Story

Most Viewed