పీరియడ్స్‌‌లో ప్యాడ్స్‌కు బదులు పాత దుస్తులు, ఆకుల వినియోగం.. మురికిగా ట్రీట్ చేస్తున్న తల్లులు

by Disha Web Desk 23 |
పీరియడ్స్‌‌లో ప్యాడ్స్‌కు బదులు పాత దుస్తులు, ఆకుల వినియోగం.. మురికిగా ట్రీట్ చేస్తున్న తల్లులు
X

దిశ, ఫీచర్స్: రుతు పరిశుభ్రత ఆడపిల్లల విద్యకు అవరోధంగా మారుతోంది. విద్యా సంస్థల్లో పారిశుధ్య సౌకర్యాల లేమి, రుతు సంబంధిత ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడం, రుతుస్రావం సంబంధిత కళంకం కారణంగా పాఠశాల నుంచి తప్పుకుంటున్నారు. కనీసం పది పాస్ కాకముందే ఇంటికి పరిమితమవుతుండటంతో.. వారి జీవితాల్లో ఎదుగుదల లేకుండా పోతోంది. జీవితాంతం మరొకరి అండతో బతకాల్సి వస్తోంది. అందుకే ప్రతీ పాఠశాలలో బాలికలకు ఫ్రీ శానిటరీ న్యాప్‌కిన్స్, సెపరేట్ వాష్‌రూమ్స్ కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ ఉన్నత న్యాయస్థానానికి అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో దీనిపై విచారించిన సుప్రీం కోర్టు మెన్‌స్ట్రువల్ హైజీన్‌పై యూనీఫామ్ నేషనల్ పాలసీని తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.

నిజానికి 70శాతం మంది తల్లులు పీరియడ్స్‌ను ‘డర్టీ’గా ట్రీట్ చేస్తున్నారు. ఈ అజ్ఞానం అవమానకరమైన సంస్కృతిని శాశ్వతం చేస్తుంది. ఇక 88శాతం మంది మెన్‌స్ట్రువల్ ఉమెన్ సాధారణంగా శానిటీరీ ప్యాడ్స్‌కు బదులు పాత దుస్తులు, బూడిద, గడ్డి, ఆకులు, ఇసుక, వార్తాపత్రికలను ఉపయోగిస్తున్నారు. దేశంలో 63 మిలియన్ల కౌమార బాలికలు ఇంట్లో టాయిలెట్ ఫెసిలిటీ లేకుండా బతుకుతున్నారు. ఇవి ఋతు పరిశుభ్రతను ప్రభావితం చేయడంతోపాటు పునరుత్పత్తి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ఎఫెక్ట్ చూపుతున్నాయి. పేలవమైన పరిశుభ్రత కారణంగా అంటువ్యాధుల సంభావ్యత 70శాతం పెరుగుతుంది. ఆర్థిక స్థితి, నిరక్షరాస్యత ఇందుకు కారణాలు కాగా.. బాలికలు తమ అకాడమిక్ ఇయర్‌లో దాదాపు 20శాతం స్కూళ్లకు సెలవు పెట్టేస్తున్నారు. ఇవే పరిస్థితులు స్కూల్ డ్రాప్ అవుట్స్‌కు దారితీస్తున్నాయి.

అయితే శానిటరీ ప్యాడ్స్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడంతో పాటు బాల్య వివాహాలు తగ్గిపోతాయి. ఎర్లీ ప్రెగ్నెన్సీస్‌‌ సమస్యే ఉండదు. తద్వారా ఆడపిల్లలు తమ జీవితకాలంలో ఇండియా జీడీపీకి రూ. 820కోట్లను జోడించే సామర్థ్యం కలిగి ఉంటారు. రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రత సమస్యను పరిష్కరించడం ద్వారా విద్య, ఆరోగ్యం, పర్యావరణానికి సంబంధించిన రంగాల్లో పెట్టుబడిపై మూడు రెట్లు రాబడి వస్తుంది. ఈ సమస్యపై అధిక ప్రాధాన్యత ఈ సెక్టార్‌లో ఇన్వెస్టిమెంట్‌కు కారణమవుతుంది. ఏడు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్‌లో నాలుగు(మానసిక ఆరోగ్యం, మెటర్నల్ హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, జెండర్ ఈక్వాలిటీ) అచీవ్ చేసేందుకు భారతదేశానికి సహాయం చేస్తుంది.

ఈ పరిస్థితులు రావాలంటే ముందుగా తల్లులను ఎడ్యుకేట్ చేయాలి. స్కూళ్లపై ఫోకస్ చేయాలి. అందుకే భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కూడా పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్ల లభ్యత, శానిటరీ ప్యాడ్‌ల సరఫరాపై వివరాలను సమర్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ‘సమీకరణలతో రాష్ట్రాలు ఒకే విధమైన జాతీయ విధానాన్ని అమలు చేసేలా చూడడానికి కేంద్రం అన్ని రాష్ట్రాలతో పనిచేయాలి. లేవనెత్తిన సమస్య ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని.. అన్ని రాష్ట్రాలు, UTలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పించాలి. ఋతు పరిశుభ్రత విధానాలను నాలుగు వారాల్లోగా తమ సొంత నిధుల నుంచి కేటాయించాలి’ అని కోర్టు ఆదేశించింది.

ఇక జాతీయ మార్గదర్శకాలను తిరిగి మూల్యాంకనం చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన మిషన్ స్టీరింగ్ గ్రూపుకు సూచించింది కోర్టు. ప్రక్రియను సులభతరం చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కూడా నామినేట్ చేసింది. ‘రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని బాలికల మరుగుదొడ్ల నిష్పత్తిని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు మిషన్ స్టీరింగ్ గ్రూప్‌కు సూచిస్తాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు శానిటరీ ప్యాడ్‌లు, శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్... వాటిని పారవేసే విధానం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి’ అని సూచించింది.

Also Read..

గేదె మూత్రం తాగండి.. గోమూత్రంతో అనారోగ్యం : స్టడీ



Next Story

Most Viewed