ప్రెగ్నెన్సీ సమయంలో శరీరం దురదగా ఉంటుందా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్..

by Disha Web Desk 20 |
ప్రెగ్నెన్సీ సమయంలో శరీరం దురదగా ఉంటుందా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్..
X

దిశ, ఫీచర్స్ : గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీకి ఒక అందమైన క్షణం. అయితే గర్భధారణ సమయంలో అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో స్త్రీల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దాని కారణంగా వారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది మహిళలు దురద సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య కారణంగా ప్రశాంతంగా ఉండలేకపోతుంటారు. మరి ఈ సమస్య ఎలా వస్తుంది. దీనికి సరైన వైద్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భధారణ సమయంలో తీవ్రమైన దురద కొన్ని వైద్య సమస్యల వల్ల వస్తుందని తెలిపారు.. అయితే ఇంటి నివారణలతో దురద సమస్యను తగ్గించుకోవచ్చట. గర్భధారణ సమయంలో దురద సమస్య నుంచి ఉపశమనం కలిగించే ఈ ఇంటి చిట్కాలతోనే ఈజీగా నివారించుకోవచ్చు. మరి ఇంతకీ ఆ నివారణ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వోట్మీల్

వోట్మీల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చర్మం దురద, వాపు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఓట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు చర్మానికి ఉపశమనాన్ని ఇస్తాయట.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె దురద సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే రిక్ యాసిడ్ ఎఫెక్టివ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె కూడా సహజమైన మాయిశ్చరైజర్, ఇది పొడి చర్మం, ఎగ్జిమా, సోరియాసిస్‌ను నివారిస్తుంది. దురద ఉన్న చోట కొబ్బరి నూనె రాసి రాత్రంతా తర్వాత కడిగేయాలి.

నిమ్మరసం

దురద నుంచి ఉపశమనం పొందడంలో నిమ్మరసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సిట్రిక్ యాసిడ్ కలిగి ఉన్నందున దాని ఆమ్ల స్వభావం కారణంగా చర్మంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. నీళ్లలో నిమ్మరసం మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి దాదాపు అరగంట తర్వాత కడగాలి. మీరు దురద నుంచి చాలా ఉపశమనం పొందుతారు. ఇది కాకుండా, మీరు దురద ఉన్న ప్రదేశంలో అలోవెరా జెల్‌ను కూడా అప్లై చేయవచ్చు. ఇది దురద నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.



Next Story

Most Viewed