ఇష్టంగా ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా..ఇది మీకే కాదండోయ్ మీ తర్వాత తరాలకు కూడా ముప్పే!

by Disha Web Desk 8 |
ఇష్టంగా ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా..ఇది మీకే కాదండోయ్ మీ తర్వాత తరాలకు కూడా ముప్పే!
X

దిశ, ఫీచర్స్ : ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా మంది ఎంతో ఇష్టంగా బయటకు వెళ్లి ఫాస్ట్ ఫుడ్ తిని వస్తారు. ఇంకొందరు ఇంట్లో వంట కూడా చేయకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి పార్సిల్ తెచ్చుకొని ఇష్టంగా తింటూ ఉంటారు.అయితే తాజాగా చేసిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి.చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇతర ఫాస్ట్ ఫూడ్ వల్ల దీర్ఘకాలికంగా మెదడు దెబ్బ తినవచ్చని, ఇది మన పైనే కాకుండా రాబోయే తరాలపై కూడా ప్రభావం చూపుతోందని వారు పేర్కొన్నారు.

అయితే చికాగోకు చెందిన యూనివర్సిటీ వారు రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని ఫుడ్‌ను ఎలకలకు తినిపించి అధ్యయనం చేశారు. ఆహారం తిన్న ఎలుకల కాలేయంలో వాపు, జ్ఙాపకశక్తి తగ్గడం, అలాగే దీర్ఘకాలంలో డిమెన్షియాకి కారణం అవ్వడం గుర్తించారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందని సెర్చ్ చేయగా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా వేడి చేసిన నూనెను, పదే పదే వాడుతారు, దీని వలన మెదడు దెబ్బతిన్నట్లు వారు తెలిపారు.

అంతే కాకుండా ఈ ఆహారం తిన్న ఎలుక పిల్లల్లో కూడా అదే సమస్య కనిపించిందంట. దీంతో అలాంటి ఫుడ్ తినకూడదని పరిశోధకులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ మళ్లీ మళ్లీ వేడి చేసినపుడు కాలేయంలో ఆక్సిడేషన్ ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ పెరిగింది. పెద్దపేగుల్లో సమస్యలు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరో డిజెనరేటివ్ వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉదని, అందువలన ఫాస్ట్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదని వారు పేర్కొన్నారు.



Next Story

Most Viewed