రాత్రిల్లో ఎక్కువ స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుందా..ఇది కూడా వ్యాధే!

by Disha Web Desk 8 |
రాత్రిల్లో ఎక్కువ స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుందా..ఇది కూడా వ్యాధే!
X

దిశ, ఫీచర్స్ : కొంత మందికి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినడం చాలా ఇష్టం. తప్పనిసరిగా డైలీ తింటూ ఉంటారు. అయితే వీటిని కొందరి ఉదయాన్నే తినాలనిపిస్తే, మరి కొందరికి మధ్యాహ్నం, రాత్రి సమయంలో తినాలనిపిస్తుంది. అయితే రాత్రి సమయంలో కొంతమందికి అతిగా స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుందంట. ఇలా తినాలనిపించడం వెనుక కూడా ఓ ప్రత్యేకమైన కారణం ఉన్నదంటున్నారు నిపుణులు.

ఒంటరి తనం వల్లనే నైట్ టైమ్‌లో చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినాలని పిస్తుందంట. దీనికి కారణం ఒంటరితనమే అంటున్నారు నిపుణులు. లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీవారు. ఒంటరిగా ఉన్న కొంతమందిని తీసుకొని పరిశోధన చేయగా,ఈ విషయం వెల్లడైందంట. ఒంటరిగా ఉండేవారిలో మాత్రం స్థూలకాయం, నిరాశ, ఆందోళన పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇవి పెరగడానికి స్వీట్ క్రేవింగ్స్​ కూడా ఓ ప్రధాన కారణమవుతుందని తెలిపారు. ఒంటరిగా ఉన్నప్పుడు స్వీట్స్​ తినాలనే ఎక్కువగా అనిపిస్తుందని, దానివల్ల స్థూలకాయం, మధుమేహం, అతిగా తినడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. ఇది కూడా ఓ వ్యాధిలాంటిదే.. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు.



Next Story

Most Viewed