ఈ ఆసనం వేస్తే గ్యాస్ట్రీక్ ప్రాబ్లం ఉండదు.. ఎలా వేయాలంటే ?

by Dishanational2 |
ఈ ఆసనం వేస్తే గ్యాస్ట్రీక్ ప్రాబ్లం ఉండదు.. ఎలా వేయాలంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : నేలపై కూర్చుని కాళ్లు ముందుకు చాపి వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఆ తర్వాత రెండు చేతులను భుజాలకు సమానమైన ఎత్తులో గాల్లో ఉంచాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులను నిదానంగా పైకి లేపి చెవులకు ఆన్చాలి. శరీరాన్ని పైకి లాగినట్లు ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. అలాగే చిన్నగా శ్వాసను వదులుతూ వెన్ను, మెడ ఎటు తిప్పకుండా బాడీని కాళ్లపైకి వంచుతూ చేతి వేళ్లతో కాలు బొటన వేలును అందుకోవాలి. అలా కనీసం ఓ పదిసార్లు చేస్తే పొత్తికడుపు మీద ఒత్తిడి పడుతూ జీర్ణ వ్యవస్థలో కదలిక మొదలవుతుంది.

ప్రయోజనాలు:

  • రక్తశుద్ధి జరుగుతుంది.
  • జీర్ణశక్తి పెరుగుతుంది.
  • క్లోమగ్రంథి ఉత్తేజితం కావడంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
  • మలబద్దకం ఉండదు.
  • గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, తలనొప్పి తగ్గుతాయి.
  • కండరాల మీద ఒత్తిడితో పొట్టకూడా కరుగుతుంది.
  • వెన్నుపూస, మోకాళ్లకు బలం చేకూరుతుంది.

Next Story