షాకింగ్..ఫేషియల్ చేయించుకున్న మహిళకు హెచ్‌ఐవీ!

by Disha Web Desk 18 |
షాకింగ్..ఫేషియల్ చేయించుకున్న మహిళకు హెచ్‌ఐవీ!
X

దిశ,వెబ్‌డెస్క్: చాలా మంది అందంగా కనిపించడం కోసం ఎన్నో ప్రయత్నలు చేస్తుంటారు. మెరిసే చర్మం కోసం రకరకాల క్రీములు, లోషన్‌లు యూజ్ చేస్తారు. ఈ క్రమంలో ఫేషియల్ కూడా చేయించుకుంటారు. ఇక ఫేషియల్‌లో ఎన్నో రకాలు ఉంటాయి. తాజాగా ఓ ఫేఫియల్ గురించి షాకింగ్ విషయం బయటపడింది. అది ఏంటంటే..న్యూ మెక్సికోలో షాకింగ్ ఘటన జరిగింది. వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు హెచ్‌ఐవీ సోకింది.

ఈ ఫేషియల్‌లో ఓ వ్యక్తి చేతి నుంచి రక్తం తీసి అందులో ప్లేట్‌లెట్స్ వేరు చేసి ముఖంపై ఇంజెక్ట్ చేస్తారు. 2018లో మెక్సికోలోని ఓ స్పాలో కొందరు మహిళలు ఈ ఫేషియల్ చేయించుకున్నారు. వారిని పరీక్షించగా హెచ్ఐవీ సోకినట్లు అమెరికాలోని (CDC) సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్స్‌తాజాగా తెలిపింది. ముఖం యవ్వనంగా కనిపించేందుకు ఈ ఫేషియల్ చేయించుకుంటారంట. అయితే అపరిశుభ్ర వాతావరణంలో చేసే ఈ ప్రక్రియ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.



Next Story

Most Viewed