హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : చాడ

by  |
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : చాడ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో సామాన్య జనాలతో ప్రముఖులూ తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా.. వైరస్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తీసుంకుంటున్న చర్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. యాక్టివ్ కేసులు 50 వేలు దాటాయని, మరణాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కేంద్ర విధానాల వల్లే దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పండిందని, ప్రజల ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చాలని, నెలకు 25 కేజీల బియ్యం, రూ.5 వేలు ఇవ్వాలని సూచించారు.



Next Story

Most Viewed