టీకా ట్రయల్స్‌కు తొలి వాలంటీర్‌గా హర్యానా మినిస్టర్

by  |
టీకా ట్రయల్స్‌కు తొలి వాలంటీర్‌గా హర్యానా మినిస్టర్
X

చండీగఢ్: కరోనాను నిలువరించడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న టీకా కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌లో తొలి వాలంటీర్‌గా హర్యానా మినిస్టర్ అనిల్ విజ్ ముందుకు వచ్చారు. హర్యానాలో ఈ నెల 20న మూడో దశ ట్రయల్స్ ప్రారంభమవుతున్నాయని, ఇందులో తాను తొలి వాలంటీర్‌గా మారనున్నట్టు ట్వీట్ చేసి వెల్లడించారు. ఢిల్లీలో చాలా కేసులు హర్యానా నుంచే వస్తున్నాయని అరవింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్‌ను తప్పుబట్టారు. కరోనా కేసులు తగ్గించడంపై ఢిల్లీ సర్కారు దృష్టిపెట్టాలని సూచించారు. పాఠశాలలు తెరవడంపైనా స్పందించారు. కరోనా వైరస్ నుంచి అప్రమత్తంగా ఉంటూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైన జీవనవిధానాన్ని అవలంభించాలని, పాఠశాలలు తెరవడానికి మధ్యే మార్గాన్ని అన్వేషించాల్సి ఉన్నదని పేర్కొన్నారు.

Next Story