లాక్‌డౌన్ పొడిగించిన హర్యానా ప్రభుత్వం..

by  |
లాక్‌డౌన్ పొడిగించిన హర్యానా ప్రభుత్వం..
X

దిశ, వెబ్ డెస్క్ : కొవిడ్ నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ నెల 3 నుంచి 10 వరకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. నిబంధనల మేరకు రేపటితో లాక్ డౌన్ ముగియనుండటంతో ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమలు చేస్తున్న కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్టు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5.గంటల వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు తెలిపారు. అలానే జూన్ 15 వరకు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు.

Next Story