అక్కడ బస్సు చక్రం కదిలింది

by  |
అక్కడ బస్సు చక్రం కదిలింది
X

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ అనంతరం బస్సు సేవలను తొలిసారిగా హర్యానా రాష్ట్రం పునరుద్ధరించింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి పరిమిత సంఖ్యలో బస్సులను ప్రారంభించింది. 52 మంది ప్రయాణికుల సామర్థ్యమున్న బస్సులో భౌతిక దూరాన్ని పాటించేందుకు కేవలం 30 మందినే అనుమతిస్తున్నది. అనేక మంది వలస కూలీలను ఇతర రాష్ట్రాలకు పంపించిన హర్యానా.. అంతర్గతంగానూ పలు జిల్లాల్లో చిక్కుకుపోయినవారి గురించి ఈ బస్సు సేవలను ప్రారంభించింది. అందుకే, బస్సు మొదలైన స్టాప్ నుంచి మధ్యలో ఎక్కడా స్టాప్‌లు లేకుండా.. గమ్యస్థానంలో ఆగుతున్నాయి. ఈ బస్సులో ప్రయాణించేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 29 రూట్లల్లో తొలుత ఈ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసినా.. తొమ్మిది రూట్లల్లో టికెట్లు బుక్ కాలేదు.

Next Story

Most Viewed