చేనేత కార్మికుల మౌనదీక్ష

by  |
చేనేత కార్మికుల మౌనదీక్ష
X

దిశ, నల్లగొండ: జిల్లాలోని చండూరు పట్టణ కేంద్రంలో చేనేత కార్మికులు మౌనదీక్ష చేపట్టారు. లాక్​డౌన్​ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తున్ననేపథ్యంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు. మరుసటి రోజు మార్చి 23 నుంచి లాక్​డౌన్ విధించారు. ఫలితంగా చేనేత కార్మికుల జీవన స్థితిగతులు గాడి తప్పాయి. రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికులకు పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి చేనేతలు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed