ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్లు ఉపయోగించడం సురక్షితమేనా?

by  |
Hand sanitiser
X

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు వెలుగు చూసినప్పటి నుంచి వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అనేక ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వైరస్ సంక్రమణను అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం కీలకంగా మారగా.. శానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. అయితే ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని సలహాలు, వాస్తవాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో) వెల్లడించింది. అవేంటో తెలుసుకుందాం..

ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్‌ను ఎంత పరిమాణంలో ఉపయోగించాలి?

చేతులు మొత్తం కవర్ అవ్వాలంటే అరచేతి నిండా శానిటైజర్‌ తీసుకుని, సరైన టెక్నిక్ ఉపయోగిస్తూ రెండు చేతులు డ్రై అయ్యేవరకు రాసుకోవాలని డబ్లూహెచ్‌వో సూచిస్తోంది. ఈ ప్రాసెస్ కనీసం 20-30 సెకన్ల వరకు ఉండాలని తెలిపింది.

ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్లు ఉపయోగించడం సురక్షితమేనా?

శానిటైజర్లలో ఉండే ఆల్కహాల్ వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని డబ్లూహెచ్‌వో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆల్కహాల్‌ చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే చర్మంలోకి అబ్జార్బ్ అవుతుందని, చాలా వరకు ఉత్పత్తుల్లో చర్మం పొడిబారటాన్ని తగ్గించే ఎమోలియంట్(చర్మాన్ని మృదువుగా చేసేవి) పదార్థం కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

హ్యాండ్ శానిటైజర్‌ను తరచుగా ఉపయోగించవచ్చా?

చేతులు కడుక్కునేందుకు సబ్బు, నీటిని ఉపయోగించాలని ఎక్స్‌పర్ట్స్ రికమెండ్ చేస్తున్నప్పటికీ.. హ్యాండ్ శానిటైజర్స్ తరచూ వాడటం సురక్షితమే. అంతేకాదు ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ ఎలాంటి యాంటిబయాటిక్ రెసిస్టెన్స్‌ను క్రియేట్ చేయదని డబ్లూహెచ్‌వో చెప్పింది. ఇతర యాంటిసెప్టిక్స్, యాంటిబయాటిక్స్‌ మాదిరి కాకుండా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్లను వాడినపుడు పాతోజెన్స్(హానికారక క్రిములు) రోగనిరోధకతను పెంపొందించుకోలేవని తెలిపింది.

పబ్లిక్ ప్లేస్‌లో ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను ముట్టుకోవడం వల్ల కరోనా సోకుతుందా?

లేదు. మీరు బాటిల్‌ను ముట్టుకున్నప్పుడు దానిపై ఉండే క్రిములు మీ చేతికి అంటుకున్నా, ఆ తర్వాత శానిటైజ్ చేసుకుంటారు కాబట్టి అవన్నీ నశిస్తాయి. అందువల్ల పబ్లిక్ ప్లేస్‌లో ఉన్న శానిటైజర్‌ వాడకం వైరస్ ప్రభావానికి గురిచేయదు.

చేతుల్ని తరచుగా కడుక్కోవడం లేదా గ్లోవ్స్ ధరించడం? ఏది ఉత్తమం?

చేతులకు గ్లోవ్స్ ధరించడం వల్ల క్రిములు ఒక సర్ఫేస్ నుంచి మరొక ప్లేస్‌కు సంక్రమించే అవకాశం ఎక్కువ. పైగా వాటిని తొలగించేటప్పుడు మీ చేతులకు క్రిములు అంటుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు గ్లోవ్స్ ధరిస్తే, వాటిని తీసేశాక తప్పనిసరిగా చేతులను శానిటైజ్ చేసుకోవాలి. ‘గ్లోవ్స్ ధరించడం వల్ల చేతులను పరిశుభ్రంగా ఉంచుకోలేరు. కొన్ని నిర్దిష్ట పనులకు మాత్రమే హెల్త్ వర్కర్స్ గ్లోవ్స్ ధరిస్తారు’ అని డబ్లూహెచ్‌వో స్పష్టతనిచ్చిం


Next Story

Most Viewed