విద్యార్థులకు శుభవార్త.. గురుకుల ప్రవేశాలకు మరో చాన్స్

83

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలల్లో ప్రవేశాల దరఖాస్తు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 10వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని టీఎస్‌డబ్ల్యూ‌ఆర్ఎస్/జూనియర్ కళాశాలల్లో జనరల్, వృత్తి విద్యా కోర్సుల్లో జూనియర్ ఇంటర్మీడియట్‌లో ప్రవేశ పరీక్ష (టీఎస్‌డబ్లూ‌ఆర్‌జేసీ-సెట్-2021) కోసం అర్హులైన, ఆసక్తికర అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

వీరికి ఏప్రిల్ 4న ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదిక 2020-21 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ ద్వారా పదో తరగతి అభ్యర్థులు సైతం ఈ నెల10వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరిన్ని వివరాలను www.tswreis.in, www.tswreisjc.cgg.gov.in సైట్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..