'మై నేమ్ ఈజ్ 420' పేరు మణికంఠ

by  |
మై నేమ్ ఈజ్ 420 పేరు మణికంఠ
X

దిశ ఏపీ బ్యూరో : గుంటూరులో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చోటుచేసుకున్న బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో ఇప్పటి వరకు 9 మంది అరెస్టయ్యారు. ఈ కేసులో మూడో ప్రధాన నిందితుడు, సోషల్ మీడియాలో బాధితురాలి నగ్న చిత్రాలను అప్ లోడ్ చేసిన ‘మై నేమ్ ఈజ్ 420’ ఇన్ స్టా గ్రామ్ ఖాతా దారుడు మణికంఠతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 9 కి చేరింది.
తల్లిదండ్రులు పోలీసు విభాగానికి చెందిన వారు కావడంతో వారి పలుకుబడిని ఉపయోగించి బయటపడదామని భావించిన వరుణ్ బాధితురాలిని ప్రేమపేరిట వంచించగా, సానుభూతి పేరిట కౌశిక్ ఆమె వంచితురాలిని చేశాడు. ఆ తర్వాత మణికంఠ, ధనుంజయ్ రెడ్డి ఆ ఫోటోలు, వీడియోలను ఉపయోగించుకుని బ్లాక్ మెయిల్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. బాధితురాలికి వేధింపులు ఆగకపోగా విషయం కాస్త కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో 9 మందిని అరెస్టు చేశారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ త్వరలో దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు.

Next Story

Most Viewed