ఆకట్టుకుంటున్న వ్యాక్సిన్ అవేర్‌నెస్ గణేష్ ఐడల్!

by  |
Ganesh Chaturthi
X

దిశ, ఫీచర్స్ : రెండేళ్లుగా కరోనా మహమ్మారితో ప్రపంచం పోరాడుతూనే ఉంది. ఈ కష్టకాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేసిన సేవలు మరువలేనివి. ఈ క్రమంలో కుటుంబాలను వదిలి, నిద్రహారాలు మాని, నిరంతరం కొవిడ్ పేషెంట్స్‌కు సేవలు చేస్తూ కోట్లాది మంది ప్రాణాలను రక్షించిన ‘ఆరోగ్య సంరక్షకుల’ గురించి ప్రశంసిస్తూ.. టీకాలపై అవగాహన పెంచడానికి గుజరాత్‌లో ఒక గణపతి ఉత్సవ నిర్వాహకులు కొవిడ్ -19 థీమ్‌పై తమ మండపాన్ని డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అహ్మదాబాద్‌లోని వేజల్‌పూర్‌లో గణేష్ యువక్ మండల్ కొవిడ్ థీమ్‌తో తయారు చేసిన వినాయకుడు.. పీపీఈ కిట్‌, మాస్క్‌, గ్లౌజులు ధరించి, చేతిలో మైక్ పట్టుకుని వ్యాక్సిన్‌పై అపోహలను తొలగించే డాక్టర్ రూపంలో దర్శనమిచ్చాడు. అలాగే ‘ఇప్పటికైనా టీకాలు వేసుకోండి. మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కొందాం. థర్డ్‌వేవ్ రాకుండా అందరం జాగ్రత్త పడదాం’ అంటూ ప్రాంగణంలో కొటేషన్లు రాశారు. ఇక పండుగ సీజన్‌లో ప్రజలు కొవిడ్ ప్రోటోకాల్స్ మరిచిపోవద్దని మండప నిర్వాహకులు సూచించారు.

Next Story